Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు కీలక ప్రశ్నలు..

Phone tapping: హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (Special Investigation Team) అధికారులు మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తున్నారు. విచారణలో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్న అధికారులు కీలక అంశాలపై ప్రశ్నలతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకంగా హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం కావడం, విదేశాలకు ఆయన వెళ్లిన అంశంపై అనుమానాలు పెరుగుతున్నాయి.

సిట్ ప్రధానంగా ప్రశ్నించిన అంశాలు:

కేసు నమోదు అయిన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు?

హార్డ్‌డిస్క్‌లను ఎవరు ధ్వంసం చేశారు?

మీ ఆదేశాలతోనే ప్రణీత్‌రావు హార్డ్‌డిస్క్‌లను నాశనం చేశారా?

Special Operations Team‌ను ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారు?

శ్రవణ్‌రావు, SIB మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

సిట్ అధికారుల అనుమానాల ప్రకారం హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం వెనుక ఒక పెద్ద కుట్ర ఉందన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, విచారణలో ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం గమనార్హం. కోర్టులో ఇప్పటి వరకు చెప్పిన వాదనలనే ఆయన తిరిగి సిట్ ముందు వినిపిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే విచారణలో ఉన్నత స్థాయి అధికారులు, మాజీ ఇంటెలిజెన్స్ ఉద్యోగుల పేర్లు వినిపించడంతో ఈ కేసు తెలంగాణ రాజకీయాలలో తీవ్ర ప్రకంపనలు రేపే అవకాశముంది. మరికొన్ని రోజుల్లో ప్రభాకర్ రావుపై సిట్ మరింత లోతుగా విచారణ చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  shyamala: ఇక నుంచి బాధ్యత గల పౌరిరాలిగా ఉంటాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *