UPI Payment: రోజువారీ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులు (UPI) ఉపయోగించే వినియోగదారులు, వ్యాపారులకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2026 అక్టోబర్ 15 నుంచి కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానం ప్రకారం ఎంపిక చేసిన పర్సన్-టు-మర్చంట్ (P2M) యూపీఐ లావాదేవీలపై 0.4% MDR వర్తిస్తుంది. అయితే సాధారణ ప్రజలు ఒకరికొకరు పంపుకునే పర్సన్-టు-పర్సన్ (P2P) లావాదేవీలకు, అలాగే చిన్న మొత్తాల చెల్లింపులకు ఈ ఛార్జీల నుంచి పూర్తిగా ఊరట లభించింది.
కొత్త నిబంధనల ప్రధాన ముఖ్యాంశాలు..
0.4% MDR వర్తింపు..
దుకాణాలు, వ్యాపార సంస్థలకు క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ ద్వారా చేసే నిర్దిష్ట పీ2ఎం (P2M) చెల్లింపులపై 0.4 శాతం రుసుము వర్తిస్తుంది.
గరిష్ట పరిమితి (Cap)..
రూ. 75,000 కంటే ఎక్కువ విలువైన భారీ లావాదేవీలపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ. 300 వరకు మాత్రమే ఎండీఆర్ పరిమితి విధించారు.
వీటికి పూర్తి మినహాయింపు..
ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి ఖాతాకు పంపే P2P లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదు. వ్యాపారులకు చేసే రూ. 2,000 లోపు (Up to ₹2,000) చిన్న లావాదేవీలకు ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది.
రూ. 6,000 బిల్లుపై ఎండీఆర్ లెక్క ఎలా ఉంటుంది?
చెల్లింపులను అలా ముక్కలు చేయడం చట్టవిరుద్ధమా? ఎదురయ్యే రిస్కులు ఏంటి?
ప్రస్తుత నిబంధనల్లో పెద్ద బిల్లును వినియోగదారులు చిన్న చిన్న యూపీఐ లావాదేవీలుగా విభజించి చెల్లించడాన్ని నేరుగా చట్టవిరుద్ధంగా పేర్కొనే స్పష్టమైన నిబంధన ఏదీ లేదు.
కస్టమర్ల నుంచి ఎండీఆర్ వసూలు చేయవచ్చా?
భవిష్యత్తులో ఇలాంటి పేమెంట్ స్ప్లిటింగ్ (లావాదేవీలను ముక్కలుగా విభజించడం) నియంత్రించడానికి ఎన్‌పీసీఐ లేదా బ్యాంకులు ప్రత్యేక ‘యాంటీ-సర్కమ్‌వెన్షన్’ నిబంధనలను తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
