OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజి’ సినిమా అభిమానుల్లో జోష్ నింపుతోంది. దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది.
‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పవన్, ఇప్పుడు ‘ఓజి’ని ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల ముంబైలో ఓ కీలక షెడ్యూల్‌ను ముగించిన ఈ చిత్ర యూనిట్, ఇప్పుడు విజయవాడలో తదుపరి షెడ్యూల్‌కు సిద్ధమైంది.
Also Read: RajaSaab: ప్రభాస్ రాజాసాబ్ రిస్క్: రెమ్యునరేషన్‌లో భారీ కట్!
OG: ఈ షెడ్యూల్ జూన్ 5 నుంచి మొదలై, జూన్ 16లోపు పూర్తవనుంది. దీంతో ‘ఓజి’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరనుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పవన్ యాక్షన్ అవతార్, సుజిత్ మార్క్ డైరెక్షన్‌తో ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.