Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఏ పబ్లిక్ మీటింగ్ కు వెళ్ళినా అక్కడ జనసైనికులు ‘ఓజీ…. ఓజీ’ అంటూ కేకలు వేయడం కామర్ అయిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాన్ తన సినిమాల బాలెన్స్ వర్క్ ను పూర్తి చేయడం మొదలు పెట్టారు. ఇటీవల కొద్ది రోజుల పాటు ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అలానే అతి త్వరలోనే ‘ఓజీ’ షూటింగ్ లోనూ ఆయన పాల్గొనబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఓజీ’కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. దర్శకుడు సుజీత్ ఫోటో ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారు. ప్రియాంక అరుల్ మోహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఓ జీ’ మూవీకి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Bougainvillea: ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ వైవిధ్యమైన చిత్రాలు చేయడానికే ఆసక్తి చూపిస్తుంటాడు. అలా చేసింది ‘పుష్ప’ మూవీ. మొదటి భాగం క్లయిమాక్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఫహద్ ఫాజిల్ రెండో పార్ట్ లో మాత్రం ప్రధాన ప్రతినాయకుడిగా నటించి, మెప్పించాడు. ఇదే సమయంలో అక్టోబర్ 17న ఫహద్ ఫాజిల్ నటించిన ‘బోగన్ విల్లా’ అనే మలయాళ చిత్రం విడుదలైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో కుంచాకో బొబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. డిసెంబర్ 13న ‘బోగన్ విల్లా’ను సోనీ లివ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ సందర్భంగా తెలుగు వర్షన్ ట్రైలర్ నూ విడుదల చేశారు.