Parthiv Patel: అద్భుతమైన టెక్నిక్..ఎడమచేతి వాటం.. ఆల్ ఫార్మాట్ లో నమ్మదగిన బ్యాటర్.. మనోడు..తిలక్ వర్మ.. చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన టాప్ క్లాస్ ఆటగాడు. 21 ఏళ్లకే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. భారత్ తరపున టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత భవిష్యత్ స్టార్‌గా, మూడు ఫార్మాట్ల ఆటగాడిగా మన్ననలు పొందుతున్న స్టార్ ప్లేయర్ గురించి మరిన్ని విషయాలు ఇపుడు తెలుసుకుందాం..
Parthiv Patel: 21 ఏండ్లకే టీమిండియా తలుపు తట్టినా ..వైట్ బాల్ క్రికెట్ లో దండిగా అవకాశాలు వస్తున్నా ఒకటి అరా మెరుపులు తప్ప అద్భుత ఇన్నింగ్స్ ఇంతవరకు ఆడింది లేదు. నిలకడలేమి..అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడంతో జట్టుకూ దూరం కావలసి వచ్చింది. చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన ఆటగాడుగా భారత భవిష్యత్ స్టార్‌గా, మూడు ఫార్మాట్ల ఆటగాడిగా మన్ననలు పొందినా.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదనే విమర్శలూ ఎదుర్కొన్నాడు.అయినా అతని టాలెంట్ అతన్ని కాపాడింది.
Parthiv Patel: కోల్పోయిన చోటే వెతుక్కున్నట్లుగా జట్టులోకి తిరిగివచ్చిన తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరగొట్టాడు. పేసర్లకు అనుకూలమైన సెంచూరియన్‌లో సెంచరీతో మరో మెట్టు ఎక్కేశాడు. సౌతాఫ్రికా పేసర్లపై అటాక్ చేసి మరీ 107 నాటౌట్ తో అద్భుతంగా ఆడి మూడో వన్డేలో టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే క్రీజులో అడుగుపెట్టి.. పవర్ ప్లేలో దంచికొట్టి.. ఆఖర్లో శివమెత్తి..ఇన్నింగ్స్ అంతా తానై కనిపించిన తిలక్ వర్మ.. భారత్ భవిష్యత్ స్టార్ గా ఎమర్జయ్యే సూపర్ ఇన్నింగ్స్ తో కదం తొక్కాడు.
Parthiv Patel: ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా మంచి స్ట్రోక్‌ప్లే కలిగిన ఈ హైదరాబాద్ ఆటగాడు దేశవాళీల్లోనూ నిలకడగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్లో అతని సగటు 50కి పైనే ఉందంటే అతని బ్యాటింగ్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 2022 ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరపున అదరగొట్టడంతో 22 ఏళ్ల తిలక్ వర్మ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగింది. 2023 సీజన్‌లోనూ రాణించడంతో.. అదే ఏడాది భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. తొలుత ఆడిన మూడు టీ20ల్లో 39, 51, 49 నాటౌట్ బాగానే ఆడినా.. ఆ తర్వాత వరుసగా విఫలం కావడంతో జట్టులో చోటు గల్లంతైంది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు.
Parthiv Patel: దీంతో మళ్లీ ఆటపై దృష్టి పెట్టి బ్యాటింగ్ లోపాలను సరిచేసుకున్నాడు. నిరాశను దాటి ఆశావహ దృక్పథంతో మైదానంలో చెలరేగాడు. మళ్లీ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సారి మాత్రం అవకాశం చేజారకుండా.. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. మూడో వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టాడు. స్విచ్ షాట్‌తో కొట్టిన సిక్సర్, స్కూప్‌తో సాధించిన ఫోర్ తిలక్ నైపుణ్యాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సఫారీ పేసర్లు చెలరేగుతున్నా..వరుసగా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ మంచినీళ్లు తాగినంత సులువుగా సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో తనకు ఎదురులేదని చాటి జట్టులో ప్లేస్ ను సిమెంట్ చేసుకున్నాడు.