Vishnu Kumar: గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో రుషికొండ ప్యాలెస్‌పై జరిగిన చర్చ లో టీడీపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రుషికొండ ప్యాలెస్‌లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రిషికొండ ప్యాలస్ లో వాళ్ళు ప్రజాధనం ఖర్చు చేసిన తీరు చూస్తుంటే ఏమానాలో అర్థంకావట్లేదు అన్నారు. అయన దానిగురించి మాట్లాడుతూ ‘’ తలుపు ఖర్చు రూ.31 లక్షలు, బాత్‌రూమ్‌లో కమోడ్ ధర రూ.11 లక్షల ఖర్చు చేశారు అని చెప్పారు. మాజీ ముఖ్య మంత్రి జగన్ భవనం కోసం పెట్టిన ఖర్చు చూస్తే సామాన్యుల కళ్లు తిరిగిపోవాల్సిందే రుషికొండ ప్యాలెస్‌లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ నేనెక్కడా చూడలేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.