Delhi: అదానీ అంశంపై పార్లమెంట్లో చర్చలు జరపాలని విపక్షపార్టీలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు దద్దరిలాయి. అదానీ అంశంపై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా పడ్డాయి.కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీల ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది.
దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో చైర్మన్ ధన్‌ఖర్ సభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు.అదాని ఇష్యూపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది.ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్.. లోక్‌సభలో అదానీ లంచం ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ సైతం గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి
.