Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని మాగనూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో బీఆర్ఎస్ నేతలతో కలిసి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆందోళన నిర్వహిస్తారన్న అనుమానంతో ఆయనను అరెస్టు చేశారు.
Makthal: బుధవారం ఉదయం తెల్లవారుజాము నుంచే మాజీ ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నేతలను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగనూరులో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు.