Telangana: తెలంగాణ వ్యాప్తంగా సీసీఐ వైఖరికి నిరసనగా మార్కెట్లలో వ్యాపారులు పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే రోజుల కొద్దీ ఎదుచూసిన తమకు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి అంటూ ఆవేదన చెందుతున్నారు. దీంతో వరంగల్ నగరంలోని ఎనుమాముల మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులంతా మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు.
Telangana: ప్రభుత్వ చొరవ లేకపోవడం, సీసీఐ కారణంగా ఈ గోస ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఇంకా ఎన్నాళ్లు తాము మార్కెట్‌లో పడిగాపులు కాయాలని కార్యదర్శిని నిలదీశారు. ఒకవైపు మంచు కురుస్తుందని, మరో వైపు తుపాన్ ప్రభావంతో భయమౌతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.