Paatal Lok 2: లాక్ డౌన్ టైమ్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ ‘పాతాళ్ లోక్’. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సీరీస్ బాషాతీతంగా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సీరీస్ కి రెండో భాగం వచ్చింది. 17 వ తేదీ నుంచి ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రాధమిక సమీక్షలు కూడా పాజిటీవ్ గానే ఉన్నాయి. సుదీప్ శర్మ రచనలో వచ్చిన ఈ సీరీస్ లో జైదీప్ ఆహ్లావత్, ఇష్వక్ సింగ్, గుల్ పనాగ్, తిలోత్తమా షోమ్, నగేశ్ కుకునూర్ ముఖ్య పాత్రలను పోషించారు. దీనిని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రసారం చేస్తోంది అమెజాన్. చూసిన ప్రేక్షకులు కూడా తొలి సీజన్ లాగే గ్రిప్పింగ్ గా ఉందని ప్రశంసిస్తున్నారు. కొంత మంది తొలి సీజన్ కంటే ఈ రెండో సీజన్ బాగుందని చెబుతుండటం గమనార్హం. అవ్నీష్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ రెండో సీజన్ 8 ఎపిసోడ్స్ లో అందుబాటులో ఉంది.