NO-Confidence Motion: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రతిపాదనపై 70 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో SP, TMC, AAP తో సహా ఇండియా కూటమి పక్షాల ఎంపీలు ఉన్నారు. ఆగస్టులో కూడా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు ఆయనపై అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 20 మంది ఎంపీల మద్దతును విపక్షాలు సేకరించాయి. అయితే ఆ తర్వాత ఆ విషయం పెండింగ్‌లో పడింది.
ఈ విషయంపై పార్లమెంటు బయట కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, నా మొత్తం రాజకీయ జీవితంలో ఇంత పక్షపాత స్పీకర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ప్రతిపక్ష ఎంపీల నోరు మూయిస్తూనే అధికార పార్టీ ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడేందుకు అనుమతిస్తున్నారు అంటూ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: One Nation One Election: ఈ సమావేశాల్లోనే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు?
NO-Confidence Motion: మరోవైపు కేంద్ర ప్రభుత్వం అదానీని కాపాడుతోందని, సభను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు. అదానీ కేసు నుంచి దృష్టి మరల్చాలని బీజేపీ భావిస్తోందని, అందుకే కాంగ్రెస్‌పై విదేశీ నిధుల ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అంటోంది. విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు ధనఖర్ బీజేపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.