matka

Matka: ‘మట్కా’ వేదికగా మెగా వర్సెస్ బన్నీ ఫ్యాన్స్!

Matka: వరుణ్‌తేజ్ నటించిన ‘మట్కా’ సినిమా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. వరుణ్‌ కి ఈ సినిమాతో అయినా సక్సెస్ దక్కుతుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమాలో పాత్ర కోసం పలు షేడ్స్ లో నటించాడు వరుణ్. పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. తొలి రోజు పర్వాలేదనిపించిన వసూళ్ళు రెండో రోజు దారుణంగా పడిపోయాయి. దాంతో పలు షోస్ ని క్యాన్సిల్ చేశారు. అయితే టికెట్ బుక్ చేసుకున్న కొంత మంది మెగాభిమానులు గొడవ చేయటంతో ఐనాక్స్ వంటి చోట్ల టికెడ్ ఎమౌంట్ ను వాపస్ చేశారు. అల్లు అర్జున్ AAA థియేటర్లలో కూడా ఆరు షోలకు గాను మూడు షోస్ క్యాన్సిల్ చేశారు.

ఇది కూడా చదవండి: KA: రూ. 50 కోట్ల గ్రాస్ సాధించిన ‘క’

Matka: ‘మట్కా’ ప్రీరిలీజ్ లో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు షోస్ క్యాన్సిల్ కావటంతో బన్నీ ఫ్యాన్స్ కావాలనే మట్కా సినిమాను మరింత కిల్ చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సినిమా బాగుంటే బన్నీ ఫ్యాన్స్ ఆపితే ఆగిపోతారా అని కౌంటర్లు పడుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని అటు చిరంజీవి, ఇటు బన్నీ ఎన్ని సార్లు చెప్పినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఆగటం లేదు. డిసెంబర్ లో ‘పుష్ప2’, జనవరిలో ‘గేమ్ ఛేంజర్’ రానున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య ఈ కోల్డ్ వార్ మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఈ వార్ కి బ్రేక్ పడేది ఎప్పుడో!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jr NTR: బాలీవుడ్ లో ఎన్టీఆర్ త్రీ ఫిల్మ్ డీల్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *