Off The Record

Off The Record: హుజూర్ నగర్‌లో బీఆర్ఎస్‌ని నడిపించే నాయకుడే కరువయ్యాడా?

Off The Record: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కి గత ఎన్నికల్లో ఓటమి ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నిక ఏదైనా గెలుపు తమదే అన్న రీతిలో సాగిన గులాబీ నేతల హవాకు మూడో టర్మ్ ఎలక్షన్స్‌తో చెక్ పడింది. ఓటమి తర్వాత కొందరు నేతలు మౌనంగా ఉండగా మరికొందరు మాత్రం పార్టీ మారి తమ దారి తాము చూసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ను లీడ్ చేసే లీడర్ లేకపోవడం కేడర్‌ను కలవరపాటుకు గురి చేస్తోందట… గ్రామాల్లో అధికార కాంగ్రెస్‌కు ధీటుగా కార్యకర్తలు ఉన్న ముందుండి నడిపించే నాయకుడి కోసం బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఎదురుచూస్తోంది. గత అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటమి తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి…ఆ సమయంలో కేడర్ చెక్కుచెదరకుండా అలానే ఉన్నా సరైన నేత లేక గులాబీ కార్యకర్తలు సైలెంట్‌గా ఉన్నారట…

Off The Record: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సైదిరెడ్డి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.అయితే ఉత్తమ్ కుమార్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. దీంతో 2019లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిపై గెలిచి మొదటిసారి హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేశారు సైదిరెడ్డి…ఇక గెలిచిన తర్వాత బీఆర్‌ఎస్‌ని గ్రామ స్థాయిలో బలోపేతం చేసిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలోకి వెళ్లిన సైదిరెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉండగా సైదిరెడ్డి పార్టీ వీడిన తర్వాత ఏడాదిగా హుజూర్ నగర్ బీఆర్ఎస్‌ను పట్టించుకునే నాయకుడే లేకుండా పోయారు.కొత్త నాయకుడిపై అధిష్టానం దృష్టి పెట్టకపోవడం బీఆర్‌ఎస్‌ కేడర్‌ని కలవరపెడుతోందట…నాయకుడు వెళ్లిన బీఆర్‌ఎస్‌ క్యాడర్ ఇంకా బలంగా ఉంది. కానీ పార్టీని లీడ్ చేసే నాయకుడి కోసం చకోర పక్షిలగా కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.

Off The Record: ఇక నల్లగొండ ఎంపీగా ఓటమి తర్వాత సైదిరెడ్డి పాలిటిక్స్‌లో కొంత సైలెంటయ్యారు. బీజేపీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా కనిపించడం లేదు.దీంతో శానంపూడి పార్టీ మార్పు అంశం మరోసారి తెరమీదకు వస్తోంది.
హుజూర్ నగర్‌లో గ్రామ, పట్టణ స్థాయిలో బీఆర్ఎస్‌కు ఉన్నంత పట్టు బీజేపీకి లేకపోవడంతో తిరిగి సైదిరెడ్డి గులాబీ గూటికి రావాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారట…ఇప్పటివరకు హుజూర్ నగర్‌లో బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌గా ఎవరిని పెట్టకపోవడంతో సైదిరెడ్డి వస్తేనే అధికార పార్టీకి దీటుగా పాలిటిక్స్ చేసే అవకాశం ఉందని కేడర్ ఎదురు చూస్తోందట…ఇదిలావుంటే బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ లీడర్ల అరెస్ట్‌లు, కేసుల విషయంలో అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తామని గతంలో పదే పదే కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో ఇప్పటికిప్పుడు పార్టీ మారిన కేసులు, గొడవలు ఎందుకని వేచి చూద్దాం అన్న ధోరణిలో ఉన్నారట.

ALSO READ  Revanth Reddy: కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *