Kurnool

Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్.. నెరవేరుతున్న రాయలసీమ వాసుల కల..!

Kurnool: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెల, రెండు నెలల్లో ఈతతంగం పూర్తి చేయాలనే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం కనిపిస్తుంది ఈ క్రమంలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ నవంబర్ 20న ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాశారు. త్వరితగతిన హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. వాస్తవంగా రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలలో మూడింట ఒక వంతు కేసులు ఉండాలి. అపుడే బెంచ్ ఏర్పాటుకు అవుతోంది.

Kurnool: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది కర్నూలుకు హైకోర్టు తరలిస్తామని గత ప్రభుత్వం చెప్పింది. దీనికి తోడు రాయలసీమ జిల్లాలలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు న్యాయ రాజధాని చేస్తామని చెప్పిన వైసీపీ మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టింది. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తుంది. సీఎం చంద్రబాబు ప్రజాగళంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలనీ న్యాయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన కానీ హైకోర్టు మాత్రం రాలేదు ప్రస్తుతం కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది.

Kurnool: ఈ క్రమంలో హైకోర్టు ప్రక్రియ మొదలు కావడంతో రాయలసీమకు ప్రయోజమేనన్న ప్రశ్నలు ఇక్కడ పలుకుతున్నాయి. వాస్తవంగా హైకోర్టు బెంచ్ అంటే మెరుగైన న్యాయ నిర్వహణ కోసం విస్తరించిన శాఖ అని చెప్పుకోవచ్చు హైకోర్టుకు మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసిన విభాగం లేదా శాఖ అనే హైకోర్టుకు సంబంధించిన బెంచ్ అని పిలుస్తారు న్యాయస్థానం లేదా న్యాయమూర్తులు కోర్టులో కూర్చునే ప్రదేశం.

Kurnool: కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల న్యాయ సేవలను పొందేందుకు ప్రయాణించాల్సిన దూరం తగ్గుతుంది హైకోర్టు బెంచ్ స్థానికంగా ఉండటం వలన ప్రజలు తమ న్యాయ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం రాజధాని వరకు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. న్యాయ సౌకర్యాలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. దీంతో హైకోర్టు బెంచ్ వలన రాయలసీమ వాసులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. దీంతో న్యాయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, యువకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపద్యంలో కూటమి ప్రభుత్వం కూడా త్వరితగతిన కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తుంది. ఇప్పటికే స్థల పరిశ్రమల కోసం అధికారులు సెర్చింగ్ చేస్తున్నారనేది సమాచారం మొత్తానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ  YS Jagan: అదానీ తో జగన్ ఒప్పందం.. జగన్ సంచలన నిజాలు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *