NTA: పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, విద్యార్థుల్లో నమ్మకాన్ని మళ్లీ తీసుకురావడానికి ఎన్టీఏలో సంచలన ప్రక్షాళన ప్రారంభించింది.
1. 47 మంది అధికారుల తొలగింపు!
ఎన్టీఏలో పనిచేస్తున్న 47 మంది అధికారులను విధుల్లోంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధుల్లోంచి తొలగించిన వారిలో కొందరిపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు సమాచారం.
2. ఔట్‌సోర్సింగ్ విధానంలో మార్పులు
గత కొన్ని నెలలుగా నీట్ (NEET) సహా పలు పరీక్షల్లో జరిగిన లీకేజీలు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది.భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా నిరోధించేందుకు ఎన్టీఏ ఉపయోగిస్తున్న ప్రస్తుత ఔట్‌సోర్సింగ్ నమూనాను పూర్తిగా మార్చి వేయనున్నారు.
3. వేగవంతమైన విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
పేపర్ లీకేజీ కేసులలో నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను తీసుకువస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా NEET, JEE, CUET తో పాటు దాదాపు 20కి పైగా జాతీయ స్థాయి పరీక్షలను ఎన్టీఏనే నిర్వహిస్తుండటంతో, ఈ ప్రక్షాళన ద్వారా విద్యావ్యవస్థపై విద్యార్థులకు మళ్లీ నమ్మకం కలుగుతుందని కేంద్రం భావిస్తోంది.
