Nirmal district: అభం శుభం తెలియని మైనర్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఆటలాడుకునే వయసులో కామాంధులు లైంగిక దాడులకు బలవుతున్నారు. చట్టాలెన్ని వచ్చినా, సమాజం చీదరించుకుంటున్నా.. దురాఘతాలు సమసిపోవడంలేదు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నది.
Nirmal district: నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలోని ఓ గ్రామానికి చెందిన 8 ఏండ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారి తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మెన సాగర్ (36) అనే దుర్మార్గుడు ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారి ఏడుస్తూ ఇంటికెళ్లి తన తల్లికి చెప్పింది.
Nirmal district: ఈ మేరకు బాధిత బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దుండుగుడికి కఠిన శిక్ష అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారిపై దుర్మార్గానికి ఒడిగట్టిన ఆ దుండగుడిని చీదరించుకుంటున్నారు.