Nikhil

Nikhil: 20 రోజులకే ఓటీటీలో నిఖిల్ చిత్రం!

Nikhil: నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. రుక్మిణీ వసంత్ తెలుగులో చేసిన తొలి చిత్రమిది. సుధీర్ వర్మ దర్శకత్వంలో బివిఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే నిఖిల్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ‘కార్తికేయ2’తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న నిఖిల్ కి ఇది పెద్ద దెబ్బే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆల్ ఆఫ్ సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్  ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను 28వ తేదీన స్ట్రీమింగ్ చేసింది. అంటే రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీలో ప్రత్యక్షమైందన్న మాట. ఈ చిత్రంలో వైవా హర్ష, దివ్యాంశ్ కౌశిక్ ముఖ్య పాత్రలను పోషించారు. కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Talasani Srinivas Yadav: మంత్రి సీత‌క్క‌, మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌కు త‌ల‌సాని స‌వాల్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *