Nidhhi Agerwal

Nidhhi Agerwal: ఒక్క హిట్ కోసం .. నిధి వెయిటింగ్

Nidhhi Agerwal: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అందంతోపాటు అభినయం కలిసి ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. అయితే మంచి నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ అమ్మడు.. కెరీర్ విషయంలో మాత్రం వెనుకబడి పోయింది. తెలుగులో మిస్టర్ మజ్ను, సవ్యసాచి చేసినా రాని పాపులారిటీ ఒక్క ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత కెరీర్ ఒక రేంజ్ లో దూసుకెళ్తుందని అనుకోగా.. ఆశించిన స్థాయిలో వెళ్లలేదు. ముఖ్యంగా ఈ భామ తీసుకుంటున్న గ్యాప్ ఆడియన్స్ నుంచి ఆమెను దూరం చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత గల్లా అశోక్ హీరోతో పాటు తమిళ్ లో ఈశ్వరన్, భూమి చిత్రాలు చేసింది.

ఇది కూడా చదవండి: Ileana: ప్రేమను సంపాదించుకోవద్దు.. ఇలియానా ఆసక్తికర కామెంట్స్!

కోలీవుడ్ లో ఈశ్వరన్ హిట్ అందుకోగా.. ఈ అమ్మడి కోసం అక్కడ గుడి కూడా కట్టే రేంజ్ కి వెళ్లింది. ఇక తెలుగులో మళ్లీ మూడేండ్ల తర్వాత హరి హర వీరమల్లు, రాజా సాబ్ సినిమాలతో వస్తుంది నిధి. ఆఫ్టర్ గ్యాప్ ఈముద్దుగమ్మ ఈ రెండు చిత్రాలతో మళ్లీ తన ఫ్యాన్స్ ని మె స్మరైజ్ చేయాలని చూస్తుంది. ఆమె ఫ్యాన్స్ కూడా అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారు. రాబోయే మూవీల్లో ఏ ఒక్కటి హిట్ పడినా టాలీవుడ్ లో ఈఅమ్మడు మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టాలీవుడ్లో ప్రస్తుతం పాస్ ఇండియా సినిమాల హంగామా నడుస్తుండగా.. నిధి కూడా అలాంటి ఒక ఛాన్స్ కోసం ఎదు రుచూస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Do Patti: పాకిస్తానీ పాట చుట్టూ వివాదాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *