Nellore

Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనితీరు వేరే లెవెల్

Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కృషితో ఏకంగా తోమ్మిది పీజీ మెడికల్ సీట్లు నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ ఏ లోక్‌సభ సభ్యుడు సాధించలేని పీజీ మెడికల్ సీట్లను విపిఆర్ సాధించారు.ఢీల్లీలో తన పలుకుబడిని నెల్లూరు అభివృద్ధి కోసం ఎంతగా ఉపయోగిస్తున్నారో నిరూపించారు. నెల్లూరు మెడికల్‌ కాలేజీలో పీజీ సీట్లు కేటాయిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.జనరల్ సర్జరీ విభాగంలో ఐదు, ఆర్థోపెడిక్ విభాగంలో నాలుగు సీట్లు కేటాయిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు పెద్ద వరం లాంటిది. ఇదే 9 పీజీ మెడికల్ సీట్ల విలువ ప్రైవేట్ కాలేజ్‌ల్లో అయితే దాదాపు వంద కోట్ల ఉంటుంది. వంద కోట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీలు అమ్ముకునే పీజీ సీట్లను, ఉచిత కోటాలో నెల్లూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు కేటాయించడంలో కీలక పాత్ర పోషించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విద్యార్థులు జేజేలు కొడుతున్నారు.

నెల్లూరు అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్న విపిఆర్ పనితీరుపై ప్రజలు ఫుల్ హ్యపీగా ఉన్నారు. ఢీల్లీలో 6 నెలలుగా పీజీ మెడికల్‌ సీట్ల కోసం వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కృషి చేశారంటా. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 9 పీజీ సీట్లను కేంద్ర వైద్యారోగ్య శాఖ  కేటాయించింది.  2024- 25 సంవత్సరానికి గాను ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో ఈ సీట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు నెల్లూరు మెడికల్‌ కళాశాలకు సమాచారం అందించింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి వల్లే ఇది సాధ్యమైనందని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ration Rice: సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం.. ఎలా మాయ చేస్తున్నారంటే…?

Nellore: నెల్లూరు మెడికల్‌ కళాశాలలో 2024- 25 సంవత్సరానికి గాను ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో  పీజీ సీట్లు కేటాయించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆగస్టు 29న నేషనల్ మెడికల్ కమిషన్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ బిఎన్ గంగాధర్‌ని ఢిల్లీలో కలిసి వివరించారు. అదే విధంగా కేంద్రమంత్రిని కలిసి పీజీ సీట్ల కేటాయింపుపై చర్చించారు.వరుసగా చాలా పర్యాయాలు ఫాలో అప్ చేశారు అందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కృషి మేరకు ఆసుపత్రిలో పర్యటించిన ఎన్‌ఎంసీ సభ్యులు కళాశాలను పరిశీలించి సీట్ల కేటాయింపు చేపట్టారు. కోత్త పీజీ సీట్లు కేటాయించడం ద్వారా యువ డాక్టర్లకు సీట్లు అందుబాటులోకి వచ్చి పేదలకు మంచి వైద్యం అందనుంది. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న వేమిరెడ్డిని మెడిసిన్ విద్యార్థులు, వారి పేరంట్స్, వైద్య సిబ్బంది విపిఆర్‌ ది రియల్ లీడర్ అంటు అభినందిస్తున్నారు.

ALSO READ  YS Jagan: వైసీపీ టాస్క్ ఫోర్స్ పనిచేసేనా...?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *