Ration Rice: పేదల పొట్ట నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించి సోమ్ము చేసుకునే అక్రమార్కులు రోజురోజుకు పెరుగుతున్నారు. గతంలో అక్కడక్కడా బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకునే వారు. అయితే గత ఐదేళ్ల పాలనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఒక పెద్ద వ్యవస్థగా మార్చేశారు. జగన్ అండదండలు పుష్కలంగా ఉండటంతో… కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేశారు. ఈక్రమంలో ద్వారంపూడి కుటుంబసభ్యులే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ల్ అసోసియేషన్ అధ్యక్షులుగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒకరు ఉండి అక్రమ రవాణాకు పూర్తిస్ధాయిలో ద్వారాలు తేరిచారు అంతేకాదు… రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాస్ధాయి మండల స్ధాయిలో టీమ్‌లు పామ్ చేసి పేదోడి బియ్యాన్ని పక్క దేశాలకు తరలించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఏ జిల్లాలో పర్యటనకు వెళ్లినా… రైస్ మిల్లులు, గౌడౌన్లు, రేషన్ డిపోలు, ఎం.డి యు వాహనాలపై దృష్టి సారించారు. కొన్ని సందర్భాలలో ఆకస్మిక తనిఖీలు చేసి… కొన్ని చోట్ల రేషన్ బియ్యం గుర్తించారు. మంత్రి నాదెండ్ల మనోహార్ పర్యటన ఉందంటే ఆ ప్రాంతంలో రైస్ మిల్లర్లు గౌడౌన్లు క్లోజే చేసేసేవారు. అలా స్టార్ చేసిన తనిఖీలు చివరకు మాఫియాకు అడ్డ అయిన కాకినాడ పోర్టుకు చేరుకున్నారు. రెండు రోజులు కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేసి 13 గౌడౌన్లు సీజ్ చేసి సుమారు 55 వేల మెట్రిక్ టన్నులు రైస్‌ను సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో సీజ్ చేసిన బియ్యంలో పిడిఎస్ రైస్ ఉందని గుర్తించినా… విచారణ తర్వాత సుమారు 27 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని నిర్దారించారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వలు చేసిన వారికి పెద్ద ఎత్తున పెనాల్టీలు వేయడమే కాకుండా… కొంత మందిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు. కాలక్రమంలో సీజింగ్ మిల్లర్లు కోర్టుకెళ్లి ప్రభుత్వం విధించిన పెనాల్టీ కట్టేసి వాటిని రిలీజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 80 కోట్లుకుపైగా ప్రభుత్వానికి వారంతా పెనాల్టీలు చెల్లించినట్లు సమాచారం.
Ration Rice: కొత్తలో కాస్తంత స్ట్రిక్ట్‌గా ఉంటారని భావించిన రైస్ మాఫీయాకు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని అర్ధమైంది. ఢీల్లీ స్ధాయిలో లాబీయింగ్ చేసి పరిస్ధితి తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేసారు. అయిన పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈ పరిస్ధితి నుంచి జాగ్రత్త పడకపోతే మరింత ఇబ్బందులు పడతామని గుర్తించిన మాఫీయా… కాకినాడ పోర్టు నుంచి మకాం విశాఖపట్నం, గంగవరం పోర్టుకు మార్చారు. అక్కడ నుంచి ఎక్స్ పోర్టు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేసిన కాకినాడ నుంచి వెళ్లినంతా ఈజీగా సౌక్యంగా రైస్ ఎక్స్ పోర్టు సాద్యం కాలేదు.
పోర్టు నుంచి విదేశాలకు పంపించేందుకు కేంద్రం నుంచి ఏదో పర్మిషన్ తెచ్చుకున్న రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి రేషన్ రైస్ కొనుగోలు, తరలింపు కష్టంగా మారింది. ఇలాంటి పరిస్ధితిల్లో ఏమీ చేయాలో అర్దం కాలేదు. సీఎం చంద్రబాబు, మంత్రి మనోహార్‌ను ఒప్పించుకునేందుకు పావులు కదిపారు. కానీ కనీసం వారిద్దరిని టచ్ చేసేందుకు ఎవరూ సాహసం చేయకపోవడంతో రైస్ మాపీయా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు.
నిత్యం బంగ్లాదేశ్, ఇండోనేషియాకు ఎక్సపోర్టు చేసే వీరంతా… ఆ రెండు దేశాలకు మానేసి ఆఫ్రికన్ కంట్రీలకు ఎక్స్ పోర్టు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆఫ్రికాలోని బియ్యం వ్యాపారులు, ట్రేడర్లతో చేతులు కలిపారు. అక్కడ సంస్ధల పేరుతో ప్రత్యేకంగా లైసెన్సులు సంపాదించారు. వాటి పేరుతో ఎక్స్ పోర్టు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఎక్కడైనా పట్టుకున్న విదేశాల లైసెన్స్ ఉండటంతో పెద్దగా వారికి ప్రమాదం ఉండదనే యోచనలోకి రేషన్ మాఫీయా వచ్చింది.
Ration Rice: మరోవైపు ఏపీ పోర్టుల నుంచి బియ్యం ఎక్స్ పోర్టు చేయడం కష్టంగా మారడంతో ముంబాయి, చెన్నై పోర్టుల నుంచి షిపింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు.క్షేత్ర స్ధాయిలో ఏర్పాటు చేసుకున్న టీమ్స్‌ను జాగ్రత్తగా ఉండేలా వ్యూహాలు రచించి, డీలర్ దగ్గర నుంచి రైస్ కొనుగోలు చేసి ఒక ప్రాంతానికి అప్పగించేలా ప్లానింగ్ సిద్దం చేసుకున్నారు. సాధ్యమైనంత వరకు ప్రతీ నియోజకవర్గంలోనే ఒక రైస్ మిల్లుతో ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన రైస్ వచ్చినట్లు షార్పింగ్ చేసేలా ప్లాన్ చేసారు. ఏదైదే ఆఫ్రీకన్ కంట్రీ లైసెన్స్‌లు ఉన్నాయో వారి పేరు మీదే బ్యాగ్‌లు రెడీ చేసి సిద్దమైన రైస్ అందులో ప్యాక్ చేస్తున్నారు. ఈ విధంగా మాఫీయా అంతా ఆఫ్రికన్ కంట్రీస్ పేరుతో వ్యాపారం నడపడం మొదలుపెట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన రేషన్ మాఫియా ఆగడాలు అరికట్టేందుకు అధికారులు, పాలకులు మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. నామమాత్రపు చర్యల వల్ల ప్రజాధనం వృధా కావడం తప్ప… ప్రభుత్వ లక్ష్యాలు చేరే అవకాశం లేదు. ఇప్పుడు అయినా… ప్రత్యేక దృష్టి పెట్టి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ.. ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించాల్సి ఉంది.