Surya Shani Yuti 2026: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం, గౌరవ మర్యాదలు, ప్రభుత్వ మద్దతు మరియు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తికి కారకుడిగా భావిస్తారు. అలాగే శనిదేవుడిని క్రమశిక్షణ, న్యాయం, కష్టపడి పనిచేసే గుణం మరియు సహనానికి ప్రతీకగా చెబుతారు.
ఆగస్టు 7, 2026 (శుక్రవారం) రోజున కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు, మీన రాశిలో సంచరిస్తున్న శనిదేవుడితో కలిసి అత్యంత అరుదైన, శుభప్రదమైన ‘నవపంచమ యోగాన్ని’ ఏర్పరుస్తున్నారు. జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాలు ఒకదానికొకటి 5వ మరియు 9వ స్థానాల్లో ముఖాముఖిగా ఉన్నప్పుడు ఈ యోగం సిద్ధిస్తుంది. ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్ ప్రణాళికలు రచించడం ఇంకా కెరీర్లో ముందుకు సాగడం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కేవలం ఆర్భాటాల వెనుక పడకుండా నిజమైన కష్టంతో విజయం సాధించే అద్భుత సమయం ఇది.
తులా రాశి నుండి మీన రాశి వరకు ఈ యోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వివరంగా తెలుసుకుందాం..
1. తులా రాశి (Libra)
పదో భావం (కర్మ స్థానం) – ఆరో భావం (పోటీ, దైనందిన పనులు) లపై ప్రభావం వల్ల నూతన పరిచయాలు, టీమ్‌వర్క్ ద్వారా ధన లాభం చేకూరుతుంది. మీ స్నేహితులు, పెద్దల సహకారంతో కెరీర్లో అనుకున్న పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి.
2. వృశ్చిక రాశి (Scorpio)
తొమ్మిదో భావం (భాగ్య స్థానం) ఐదో భావం (విద్య, సంతాన స్థానం) లపై ప్రభావం వల్ల ఆఫీసు లేదా వ్యాపారంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకుండా మీ పనిపై శ్రద్ధ పెట్టండి. మీ సహనమే మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది.
3. ధనుస్సు రాశి (Sagittarius)
ఎనిమిదో భావం ఇంకా నాలుగో భావం (సుఖం, స్థిరాస్తి స్థానం) లపై ప్రభావం వల్ల అదృష్టం కలిసివస్తుంది. చదువు, ప్రయాణాలు, నూతన నైపుణ్యాలు (Skills) నేర్చుకోవడంలో వేగం పెరుగుతుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసకోవడం ద్వారా కెరీర్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
4. మకర రాశి (Capricorn)
ఏడో భావం (భాగస్వామ్యం, వైవాహిక జీవితం) మూడో భావం (ధైర్యం, కమ్యూనికేషన్) లపై ప్రభావం వల్ల టాక్స్, ఇన్సూరెన్స్ , భాగస్వామ్య వ్యాపారాల డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన రిస్క్ తీసుకోవద్దు. సరైన ప్రణాళికతో ముందుకు సాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
5. కుంభ రాశి (Aquarius)
ఆరో భావం ఇంకా రెండో భావం (ధనం, వాక్కు స్థానం) లపై ప్రభావం వల్ల మీ సంబంధాలు, బిజినెస్ పార్టనర్‌షిప్‌లు చాలా ప్రత్యేకంగా మారతాయి. స్పష్టమైన సంభాషణ, ఓర్పు వల్ల బంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులతో కలిసి పనిచేయడం భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది.
6. మీన రాశి (Pisces)
ఐదో భావం ఇంకా మొదటి భావం (వ్యక్తిత్వం, స్వభావం) లపై ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీ కష్టానికి అన్ని వైపుల నుండి ప్రశంసలు అందుతాయి. నియమబద్ధంగా పనిచేయడం వల్ల అనుకున్న వేగం అందుకోగలుగుతారు.
పరిహారం: విష్ణుమూర్తి ఆలయంలో పసుపు రంగు తీపి పదార్థాలను నివేదించండి.
