Narendra Modi: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్‌నకు మోదీ సహా ప్రపంచంలోని వివిధ దేశాల అధిపతుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మోదీ పంపిన గ్రీటింగ్స్ ఇరుదేశాల స్నేహానికి మరింత దోహదం చేస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Narendra Modi: “నాప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు. యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మన రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నా. ప్రపంచానికి మంచి భవిష్యత్తును రూపొందించడానికి నేను మరోసారి మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. మీ పదవీకాలం విజయవంతంగా సాగాలి” అంటూ మోదీ ట్వీట్ చేశారు.
Narendra Modi: అమెరికా వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రుటుండాలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా సాగింది. ఇదే సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉండగా, జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడు కావడం విశేషం. ఆయన భార్య ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.