Ponguru Narayana

Ponguru Narayana: రాష్ట్రంలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెడుతాం..

Ponguru Narayana: వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు శాశ్వత పరిష్కారం కనుగొనాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమర్థవంతమైన మోడల్స్‌ను స్వీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో అధికారులు దేశంలోని ప్రముఖ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను సందర్శిస్తున్నారు.

నిన్న రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న వేయిద్దట చెత్త నుంచి విద్యుత్‌ తయారీ కేంద్రాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రతి రోజూ 14 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ఈ ప్లాంట్‌తో పాటు బయోగ్యాస్‌ను కూడా జనరేట్‌ చేస్తున్నారు. ప్లాంట్‌ పనితీరు, టెక్నాలజీ, విద్యుత్ వినియోగ విధానం వంటి అంశాలపై స్థానిక అధికారులు మంత్రి నారాయణకు విపులంగా వివరించారు.

ఇది కూడా చదవండి: Harish Rao: హైకోర్టులో హరీష్‌రావుకు ఊరట

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతంగా పనిచేస్తున్న మోడల్స్‌ను పరిశీలించి, మా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్తమ విధానాన్ని ఎంచుకుంటాం” అని తెలిపారు.

ఈరోజు (మంగళవారం) ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలోని చెత్త నిర్వహణ విధానాలను, అక్కడి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను పరిశీలించనున్నట్లు సమాచారం. మంత్రి నారాయణతో పాటు స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో భాగంగా ఉన్నారు.

ఈ పర్యటనల ద్వారా..

  • వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న సాంకేతిక సమస్యలపై అవగాహన

  • చెత్తను విద్యుత్‌, బయోగ్యాస్‌లుగా మలచే సాంకేతిక పరిజ్ఞానం

  • పర్యావరణ హితమైన చర్యల రూపకల్పనకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

ఈ పరిశీలనలు అనంతరం ప్రభుత్వ విధానాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Actor Siddique: లైంగిక వేధింపుల ఆరోపణలపై నటుడు అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *