Fire Accident: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, మరికొందరు ఈ మంటల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఇంకా ఆరో అంతస్థులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నివాసిత అపార్ట్‌మెంట్ కావడంతో మంటలు అదుపులోకి వచ్చాక పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నది.
Fire Accident: ద్వారకా ప్రంతాంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ అపార్ట్‌మెంట్ వద్దకు 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది చేరుకొని మంటలను అదపుచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిప్రమాదం చోటుచేసుకోగానే నివాసితులు బయటకు పరుగులు తీశారు. ఈ సమయంలో ఓ ముగ్గురు పైనుంచి కిందికి దూకడంతో వారికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం. వారిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
Fire Accident: ఇప్పటికీ మంటలు చెలరేగుతుండటంతో మంటలు కొందరు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.