Nara Devansh

Nara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!

Nara Devansh: నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ సరికొత్త సాహసానికి శ్రీకారం చుట్టాడు. చిన్న వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిరుచిని చాటుకుంటూ, సరికొత్త యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

రూమ్ అంతా డైనోసార్లే.. లోకేష్ ట్విస్ట్!

ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే నేను కొద్దిగా అయోమయానికి (Confused) గురయ్యాను. నా రూమ్ అంతా అకస్మాత్తుగా డైనోసార్లతో నిండిపోయింది. ఎక్కడ చూసినా డైనోసార్ల పుస్తకాలు, డైనోసార్ల పెయింటింగ్‌లు, డైనోసార్ల బొమ్మలే కనిపించాయి. అసలు ఏం జరుగుతుందో నాకు మొదట అర్థం కాలేదు.అని లోకేష్ పేర్కొన్నారు.

‘డైనో డీట్స్’ (Dino Deets) పాడ్‌కాస్ట్

ఆ తర్వాతే దేవాన్ష్ అసలు సీక్రెట్ బయటపెట్టాడట. డైనోసార్లపై తనకున్న ఇష్టంతో దేవాన్ష్ సొంతంగా ఒక పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించబోతున్నాడు.

  • పాడ్‌కాస్ట్ పేరు: ‘డైనో డీట్స్’ (Dino Deets)

  • అంశం: డైనోసార్లకు సంబంధించిన ఆసక్తికరమైన నిజాలు, విశేషాలు.

  • మొదటి ఎపిసోడ్: ఈ వారం శుక్రవారం నాడు దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ విడుదల కాబోతోంది. ప్రతి శుక్రవారం ఒక్క వీడియో రిలీజ్ చేయనున్నారు ఈ ఛానల్ లో అని తెలిపారు.

చిన్న వయసులోనే దేవాన్ష్ క్రియేటివ్ ఆలోచనలతో, ఒక పాడ్‌కాస్ట్ హోస్ట్‌గా మారుతుండటం నారా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డైనోసార్ల ప్రపంచం గురించి దేవాన్ష్ ఎలాంటి విషయాలు పంచుకోబోతున్నాడో తెలియాలంటే ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *