Nagarjuna Akkineni: నాగ చైతన్య ఇటీవలే శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, శోభిత గురించి అక్కినేని నాగార్జున ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడారు. శోభిత, చైతన్యల పెళ్లికి ముందే ఆ శోభిత తనకు తెలుసని చెప్పాడు. ఈ సందర్భంగా శోభితను కూడా చాలా పొగిడాడు.
శోభిత నాకు చాలా కాలంగా తెలుసు..
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ శోభిత తనకు చాలా కాలంగా తెలుసు. కానీ శోభితని అప్పటి ఇంకా నాగచైతన్య కలలేదు అని తెలిపాడు. ఆమె చాలా మంచి అమ్మాయి . ఆమెలో నాకు నచ్చిన గొప్పదనం ఏమిటంటే, ఆమె తనకు నచ్చినట్టు జీవితాన్ని గడపం తనకి నచ్చింది అని చెప్పాడు.
శోభిత తన కోరిక మేరకు జీవితాన్ని గడుపుతుంది – నాగార్జున
శోభిత పని తీరును ప్రశంసిస్తూ నాగార్జున మాట్లాడుతూ – ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాల్లో పనిచేసినా తనకున్న అవగాహన మేరకు చేసింది అని. శోభిత అనుకుంటే చాలా సినిమాలు చేసేది కానీ తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసింది. తాను తీసుకునే నిర్ణయాలు వల్ల తన ఇన్నర్ సెల్ఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆమెకు పని పట్ల ఉండే క్లారిటీ.. అంటూ చెప్పుకుంటూ వోచారు.
నాగార్జున ఇంకా మాట్లాడుతూ- ఇద్దరం కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. వారి ఇద్దరి మధ్య సంబంధం చాలా బాగుంది. అన్నింటికంటే చైతన్యకి చాలా సంతోషంగా ఉన్నాడు అని నాగార్జున పేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: Beetroot Benefits: ప్రతి రోజు బీట్ రూట్ తింటే మతిపోయే లాభాలు
డిసెంబర్ 4న చైతన్య, శోభిత వివాహం జరిగింది
నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ డిసెంబర్ 4, 2024 న వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్లిలో శోభిత సంప్రదాయ చీర కట్టుకోగా, నాగ చైతన్య తన తాతయ్య పంచె కట్టుకున్నాడు
నాల్గవ వివాహ వార్షికోత్సవానికి ముందే వివాహం విచ్ఛిన్నమైంది.
శోభితను వివాహం చేసుకునే ముందు, నాగ చైతన్య 6 అక్టోబర్ 2017న గోవాలో మొదట హిందూ ఆచారాల ప్రకారం, ఆపై అక్టోబర్ 7న క్రైస్తవ ఆచారాల ప్రకారం సమంతా రూత్ ప్రభుని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సమంత తన పేరును అక్కినేనిగా మార్చుకుంది. అయితే, విడిపోయిన వార్తల మధ్య, సమంతా తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి అక్కినేనిని తొలగించి, దానిని సమంతా రూత్ ప్రభుగా మార్చింది. అక్టోబర్ 6, 2021 న, వారిద్దరూ నాలుగు సంవత్సరాల వివాహాన్ని పూర్తి చేయబోతున్నారు, కానీ అంతకు ముందే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.