Thummala Nageswara Rao: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతుల్లో అసహనం నెలకొన్నది. ఈ దశలో అగో వానకాలం, ఇగో యాసంగి అంటూ కాలం నెట్టుకొస్తుందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కొంత సానుకూలత ఉన్నా, ఇంకా ఎందరో రైతులు తమ రుణమాఫీ కాలేదని గగ్గోలు పెడుతున్నారు. ఈ దశలో రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Thummala Nageswara Rao: సాగు చేసే రైతులకే రైతు భరోసా సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తాజాగా ప్రకటించారు. ఉపగ్రహ పరికరాలతో సాగు భూములను గుర్తిస్తామని వెల్లడించారు. వ్యవసాయ అధికారులు కూడా రైతుల పేర్లు, సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ అయ్యాకే అర్జులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు సెలవిచ్చారు.