Nag Panchami 2026: హిందూ సనాతన ధర్మంలో ప్రకృతిని, జీవజాలాన్ని దైవ స్వరూపంగా భావించి పూజించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. అందులోనూ సర్పాలను సాక్షాత్తు పరమశివుడి ఆభరణంగా, విష్ణుమూర్తి శేషతల్పంగా భావించి పూజిస్తాం. ప్రతి సంవత్సరం సర్పాలకు అంకితం చేయబడిన ‘నాగ పంచమి’ పండుగను భారతదేశం అంతటా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం, శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి తిథి నాడు ఈ పండుగ వస్తుంది. ఈ ఏడాది (2026) ఈ పవిత్ర పండుగను 17 ఆగస్టు 2026 (సోమవారం) నాడు జరుపుకోనున్నారు.
నాగ పంచమి పర్వదినాన శివాలయాలు నామస్మరణతో మారుమోగిపోతాయి. భక్తులు ఆలయాలకు వెళ్లి నాగదేవత విగ్రహాలకు పాలు సమర్పిస్తారు. మరికొందరు ఇంట్లోనే మట్టితో చేసిన అందమైన, రంగురంగుల పాముల ప్రతిమలను పీఠంపై ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు.
నాగ పంచమి 2026 తిథి మరియు శుభ ముహూర్తం..
ఈ ఏడాది పూజ చేసుకోవడానికి లభించే శుభ సమయం ఇంకా తిథి వివరాలను కింద పట్టికలో చూడవచ్చు..
-
భిత్తి చిత్ర నాగ పూజ: గరుడ పురాణం ప్రకారం, నాగ పంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారానికి (Main Entrance) ఇరువైపులా గోడలపై నాగదేవత చిత్రాలను లేదా గోబర్ (ఆవు పేడ)తో పాము బొమ్మలను గీసి పూజించడం అత్యంత శుభప్రదం. దీనివల్ల ఇంట్లోకి ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ, విషసర్పాలు రాకుండా రక్షణ లభిస్తుందని నమ్ముతారు.
-
నైవేద్యాలు – దానాలు: ఈ పర్వదినాన బ్రాహ్మణులకు లేదా ముత్తైదువులకు లడ్డూలు, పాయసం (ఖీర్) వంటి మిఠాయిలతో భోజనం పెట్టడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. అలాగే శివాలయంలోని సర్ప ప్రతిమలకు పాలు సమర్పించడం వల్ల జాతకంలోని కాలసర్ప దోషాలు, రాహు-కేతు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
నాగ పంచమి వెనుక ఉన్న పవిత్ర వ్రత కథ..
నాగ పంచమి పుట్టుక వెనుక మహాభారత కాలం నాటి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. హస్తినాపుర చక్రవర్తి, అర్జునుడి మనవడైన పరీక్షిత మహారాజు తక్షకుడు అనే నాగరాజు కరవడం వల్ల మరణిస్తాడు. తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవడానికి ఆయన కుమారుడైన రాజా జనమేజయుడు భూలోకంలో ఉన్న సర్పాలన్నింటినీ సర్వనాశనం చేయాలని నిశ్చయించి, అత్యంత శక్తివంతమైన ‘సర్ప యాగం’ ప్రారంభించాడు.
ఆ యా గంలో చదివే మంత్రాల ధాటికి విశ్వంలోని సర్పాలన్నీ వచ్చి అగ్నిగుండంలో పడి బూడిద కాసాగాయి. చివరకు తక్షకుడు కూడా అగ్నిలో పడే సమయం ఆసన్నమైనప్పుడు.. సర్పజాతిని రక్షించడం కోసం మానసా దేవి కుమారుడు, పరమ జ్ఞాని అయిన యువ ఋషి ‘ఆస్తీకుడు’ జనమేజయుడు వద్దకు వచ్చాడు. తన వేద పాండిత్యంతో రాజును మెప్పించి, యాగాన్ని ఆపవలసిందిగా అభ్యర్థించాడు. ఒక బ్రాహ్మణుడి, ఋషి ధర్మ బద్ధమైన కోరికను మన్నించి జనమేజయుడు యాగం ముగించాడు. శ్రావణ మాసపు శుక్ల పక్ష పంచమి నాడే పాములకు ప్రాణభిక్ష లభించింది. దాంతో సర్పాలన్నీ సంతోషంతో ఆస్తీక మహర్షిని, తమకు పాలు పోసి పూజించే మానవులను ఎల్లప్పుడూ కాపాడతామని వరమిచ్చాయి. నాటి నుండి ఈ రోజు ‘నాగ పంచమి’గా స్థిరపడింది.
నాగ పంచమి 2026 శక్తివంతమైన మంత్రం..
పూజ చేసే సమయంలో ఈ కింద పేర్కొన్న మంత్రాన్ని జపించడం వల్ల సర్ప భయం తొలగిపోయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది:
సులభమైన పూజా విధానం:
-
శుచిగా మారడం: నాగ పంచమి రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయాలి. పూజకు తెలుపు లేదా వెండి రంగు (లేత రంగు) దుస్తులు ధరించడం ప్రశస్తం.
-
పీఠం ఏర్పాటు: పూజా గదిని శుభ్రం చేసి, ఒక పీఠంపై వెండి, మట్టి లేదా రాయితో చేసిన 5 సర్పాల ప్రతిమలను ప్రతిష్టించాలి. (ఒకవేళ విగ్రహాలు లేకపోతే పసుపుతో నాగ పడగలను చేసి పూజించవచ్చు).
-
అభిషేకం: నాగ ప్రతిమలకు మొదట పాలు సమర్పించాలి. ఆ తర్వాత తేనె, గంగాజలం లేదా నీరు కలిపిన పచ్చి పాలను (కచ్చా దూద్) భక్తితో అభిషేకం చేయాలి.
-
ధ్యానం: పూజ ముగిసిన తర్వాత ధూప, దీప, నైవేద్యాలు (చలిమిడి, వడపప్పు, పాయసం) సమర్పించి, పైన పేర్కొన్న శ్లోకాన్ని మనసులో ధ్యానిస్తూ నమస్కరించుకోవాలి.
నాగ పంచమి అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఈ సృష్టిలోని ప్రతి జీవిని గౌరవించాలనే ప్రకృతి ఆరాధనకు ప్రతీక. ఈ ఏడాది ఆగస్టు 17న వచ్చే శుభ ముహూర్తంలో నాగదేవతను పూజించి, సకల శుభాలను పొందండి.
