AP News: ఆ ఇద్దరికీ ఎవరు లేరు. అయినవారు ఉన్నారు అంటే అది..తల్లికి కొడుకు, కొడుకుకి తల్లి. ఆ ఇండ్లే వారి ప్రపంచం. ఉన్నంతలో…హ్యాపీగానే ఉన్నా …ఆ తల్లి కొడులకపై కన్ను పడింది. తెల్లారేవారే సరికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చంపింది ఎవరు ? చంపడానికి కారణం ఏంటి ?
ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో అర్ధరాత్రి తల్లి-కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు రొయ్యూరు భ్రమరాంబ, సురేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.
AP News: ఒంటరిగా నివసిస్తున్న ఇంటిలో వీరు హత్యకు గురి కావడం గ్రామంలో సంచలనంగా మారింది. ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మండవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి,కుమారుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.. ఏలూరు జిల్లా గన్నవరం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలే హత్యకు కారణమా..? లేక ఇకమైన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. జంట హత్యలతో గన్నవరం గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.