Mohanlal: మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ తొలిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుని తెరకెక్కించిన సినిమా ‘బరోజ్’. దీనిని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ గ్రాండ్ గా నిర్మించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాలో టైటిల్ రోల్ ను మోహన్ లాలే పోషించారు. ఇంతవరకూ మలయాళంలో కేవలం మూడే త్రీ డీ సినిమాలు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకుని దీనిని త్రీడీ లో అద్భుతంగా తెరకెక్కించామని మోహన్ లాల్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Ram Charan: రామ్ చరణ్ కు ఇండియాలోనే అతి పెద్ద కటౌట్
Mohanlal: విజువల్ వండర్ తో పాటు స్టోరీ టెల్లింగ్ ని రీ-డిస్కవర్ చేసేలా ఇది ఉంటుందని అన్నారు. గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పంపిణీ చేయడం పట్ల మోహన్ లాల్ హర్షం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల లిడియన్ నాదస్వరం ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయడం విశేషమని మోహన్ లాల్ అన్నారు.
స్కూల్ పిల్లలకు ఉచితంగా ‘ప్రజాకవి కాళోజి’ ప్రదర్శన
Prajakavi Kaloji: మూలవిరాట్, పద్మ, రాజ్ కుమార్, స్వప్న ‘ప్రజాకవి కాళోజి’ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ”అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య, ప్రణయ వీధుల్లో” వంటి ప్రయోజనాత్మక చిత్రాలను రూపొందించిన ప్రభాకర్ జైనీ దీనికి దర్శకత్వం వహించారు. విజయలక్ష్మీ జైనీ దీనిని నిర్మించారు. ‘ప్రజాకవి కాళోజీ’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 23న విడుదల కాబోతోందని మేకర్స్ చెప్పారు.
Prajakavi Kaloji: సోమవారం నుండి ఆదివారం వరకూ ఎంపిక చేసిన థియేటర్లలో మార్నింగ్ షోస్ ను పిల్లల కోసం ఉచితంగా ప్రదర్శిస్తామని ప్రభాకర్ జైనీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 24 థియేటర్లలో వీటిని ప్రదర్శించబోతున్నామని ఆయన చెప్పారు. తమ చిత్రాన్ని విడుదల చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని కారణంగా ప్రభుత్వ సహకారంతో విద్యార్థులకు చూపుతున్నామని, రాబోయే రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ప్రయత్నం చేస్తామని అన్నారు.