MLA Sudarshanreddy: నిజామాబాధ్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం (జూన్ 10) ఏకంగా కొందరు కార్యకర్తలు బోధన్ పట్టణంలోని బీటీ నగర్‌లో ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
MLA Sudarshanreddy: ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం పదవి ఇవ్వకపోతే ప్రభుత్వ పదవులకు కూడా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనల జ్వాల ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
MLA Sudarshanreddy: ఇదిలా ఉండగా, మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సిద్ధపడ్డాడని నిన్నటి నుంచే ప్రచారం జరుగుతూ వస్తున్నది. కార్యకర్తలు కూడా తీవ్ర అసహనంతో ఉండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచించాని డిమాండ్ వినిపిస్తున్నది.