Ap news: ఏపీలో విషాదం జరిగింది. తిరుపతి జిల్లాలో కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.బస్సులో చివరి సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది గమనించి కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగగా, రేణిగుంట వద్దకు చేరుకున్నాక కండక్టర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్పేడు మండలం అంజిమేడు దగ్గర ఉదయం 5:30కి సదరు యువకుడు బస్ ఎక్కినట్లు కండక్టర్ చెబుతున్నారు. ఉదయం బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో అతను బస్సులోనే.. మంచం నవారి లాంటి తాడుతో పైన బస్సులో రాడ్ కి ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తివారి పల్లి వద్ద యువకుడు ఉరికి వేలుడుతూ ఉండటాన్ని గమనించి షాక్ తిన్నారు తోటి ప్రయాణికులు. వెంటనే బస్సు ఆపిన… కండక్టర్, డ్రైవర్.. రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అతడి వివరాలు తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు
.