Vidudala-2

Vidudala-2: ‘విడుదల-2’ నుంచి ‘పావురమా’ సాంగ్ రిలీజ్

Vidudala-2: విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు పోషించిన ‘విడుదల’ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడీ మూవీకి  సీక్వెల్ గా ‘విడుదల -2’ రాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘పావురమా… పావురమా’ అనే గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. జాతీయ ఉత్తమ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో ‘విడుదల-2’ను ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. సందేశంతో పాటు కమర్షియల్ వాల్యూస్ ఉన్నా ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. మంజువారియర్, భవానిశ్రీ, గౌతమ్ వాసుదేవ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్ తదితరులు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Venu Yeldandi: తేజ తో ‘బలగం’ వేణు రెండో సినిమా!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *