విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద నిరసనల పేరిట అలజడి సృష్టించేందుకు వైకాపా నేతలు శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి అమాయక ప్రజలను తీసుకొచ్చారని విమర్శించారు. కనీసం మెగా డీఎస్సీ అంటే ఏమిటో, అక్కడ ఏం అన్యాయం జరిగిందో కూడా తెలియని వారి చేత నినాదాలు చేయిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
16 వేల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం..
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను పూర్తి పారదర్శకంగా భర్తీ చేస్తుంటే ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కొట్టేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి, మైదానాల్లో కష్టపడి మెడల్స్ సాధించిన నిజమైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటే వైఎస్సార్సీపీ ఓర్వలేకపోతోందని స్పష్టం చేశారు.
