Director Trinadha Rao

Director Trinadha Rao: యంగ్ హీరోతో సినిమా స్టార్ట్ చేసేసిన మజాకా డైరెక్టర్!

Director Trinadha Rao: దర్శకుడు త్రినాధ రావు నక్కిన ఏమాత్రం ఆగకుండా దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ఆయన తాజాగా మరోసారి ‘మజాకా’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అలా విడుదల అయ్యిందో లేదో వెంటనే తరువాత సినిమాని మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం, ఆయన యువ హీరో హవీష్ కోనేరుతో జతకట్టాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను డైరక్ట్ చేయడంలో త్రినాధ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో హవీష్ తో సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టాడు నక్కిన త్రినాథరావు. ఈ సినిమాను ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా స్టార్ట్ చేశారట. ఇక త్వరలో ఓ మంచి ముహూర్తం చూసుకుని అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉందని సమాచారం. నువ్విలా, జీనియస్, 7 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ కోనేరు, త్రినాథరావు డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mega 157: మెగా స్పీడులో మెగా 157.. హై వోల్టేజ్ షూట్ కంప్లీట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *