Marella Vamsi Krishna:
విజయవాడలో ఆదివారం ఘనంగా కొసరాజు 9వ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరై సమావేశాన్ని ఆహ్లాదంగా నిర్వహించారు.
కార్యక్రమంలో మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణను కొసరాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వంశీకృష్ణ తనను సత్కరించిన
కొసరాజు సభ్యులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు. ఇలా కుటుంబ సమావేశానికి రావడం ఇదే తొలిసారని మారెళ్ల వంశీకృష్ణ చెప్పారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగాఉందన్నారు. “ఇక్కడ రాజవంశీయుల కంటే గొప్పవాళ్లు కనిపిస్తున్నారు. 2004 నుంచి జర్నలిజంలో ప్రయాణం కొనసాగిస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. జర్నలిస్టులు కూడా అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. జర్నలిస్టుగా పనిచేయడానికి ఏబీ వెంకటేశ్వర్‌రావు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. కొసరాజు వారి చరిత్ర, ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లాలి. వ్యతిరేక శక్తులను ఎదిరించి కొసరాజు సభ్యులు ముందుకు సాగాలి.” అని వంశీకృష్ణ పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్న వారు జర్నలిస్టుగా, మహా న్యూస్ ఛానల్ సీఎండీగా వంశీకృష్ణ సేవలను కొనియాడారు. ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో ప్రజల తరుఫున వంశీకృష్ణ చేసిన పోరాటాన్ని ప్రశంసించారు.
కొసరాజు వారి 9 వ ఆత్మీయ సమావేశం.. ముఖ్య అతిధిగా మహా గ్రూప్స్ చైర్మన్ మారెళ్ల వంశీ కృష్ణ.. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కింది వీడియోలో చూడండి .
- విజయవాడలో ఘనంగా కొసరాజు 9వ ఆత్మీయ సమావేశం
- ముఖ్య అతిధిగా పాల్గొన్న మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ
- సమావేశంలో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు
- మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణను సన్మానించిన సభ్యులు
- కొసరాజు సభ్యులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు
- కుటుంబ సమావేశానికి రావడం ఇదే తొలిసారి: మారెళ్ల వంశీకృష్ణ
- ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది: మారెళ్ల వంశీకృష్ణ
- ఇక్కడ రాజవంశీయుల కంటే గొప్పవాళ్లు కనిపిస్తున్నారు
- ఏబీ వెంకటేశ్వర్‌రావు నాకు ధైర్యాన్ని ఇచ్చారు: మారెళ్ల వంశీకృష్ణ
- కొసరాజు వారి చరిత్ర, ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లాలి
- వ్యతిరేక శక్తులను ఎదిరించి కొసరాజు సభ్యులు ముందుకు వెళ్లాలి
- 2019 నుంచి 2024 వరకు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు
- 2004 నుంచి జర్నలిజంలో నా ప్రయాణాన్ని కొనసాగించా