Crime News: నిద్రిస్తున్న అన్నకు కరెంటు షాక్ ఇచ్చి తమ్ముడు చంపిన దారుణ ఘటన ఘటన చోటుచేసుకున్నది. ఇంటిలో సర్దిచెప్పేందుకు మహిళ లేక, గంజాకు అలవాటు పడి, జులాయితనంతో ఆ దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మెదక్ జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటనపై సోదర భావాన్ని వెక్కిరిస్తున్నది. ఇలాంటి తమ్ముడు ఎవరికీ ఉండకూడదంటూ లోకం శాపనార్థాలు పెడుతున్నది.
Crime News: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యా తండా గ్రామ పంచాయతీ పరిధి నాను తండాకు చెందిన తేజావత్ శంకర్ (28) కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. అతని తమ్ముడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతున్నాడు. శంకర్ భార్య నాలుగేండ్ల క్రితం పుట్టింటికి వెళ్లి రావడం లేదు. దీంతో శంకర్‌కు కూలిపనులు చేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
Crime News: ఆ మహిళతో గోపాల్ కూడా చనువుగా ఉంటూ వస్తున్నాడు. ఈ దశలో ఇద్దరు సోదరులకు తరచూ గొడవలు జరిగాయి. ఇటీవల గోపాల్ ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్నిరోజులు బాగానే ఉన్న గోపాల్‌లో రాక్షసత్వం జడలు విప్పుకున్నది. తన అన్నతో ఉన్న గొడవలు, మహిళతో వివాహేతర సంబంధం మనసులో పెట్టుకొని తన అన్న శంకర్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
Crime News: ఈ నేపథ్యంలో అర్ధరాత్రి మద్యం మత్తులో శంకర్ ఇంటిలో మంచంపై నిద్రిస్తున్నాడు. ఇదే అదనుగా గోపాల్ భావించాడు. శంకర్ కుడి చేతి వేలికి, ఎడమకాలి వేలికి రెండు విద్యుత్తు తీగలను చుట్టాడు. స్విచ్ వేయడంతో షాక్ కొట్టి శంకర్ గట్టిగా అరిచాడు. వెంటనే వారి తండ్రి నిద్రలేవడంతో గోపాల్ అక్కడి నుంచి పారిపోగా, శంకర్ అప్పటికే మరణించాడు. తండ్రి ఫిర్యాదుతో గోపాల్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.