Manchu manoj: మంచు ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తండ్రి మీద కొడుకు మనోజ్.. కొడుకు మీద మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో పరస్పరా ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై మంచు మనోజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్. తాను, తన భార్య సొంత కాళ్ల మీద నిలబడుతున్నాం అని చెప్పారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నా అని అన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా దోపిడీకి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు గురవుతున్నారని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆరోపణలు చేస్తున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు మనోజ్.