Manchu manoj: సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
రెండు రోజుల క్రితం మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి మోహన్‌బాబు వర్సిటీకి వెళ్లగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటన తర్వాత మనోజ్ తనపై, భార్యపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు, అనుమతి లేకుండా వర్సిటీలోకి చొచ్చుకు వెళ్లడానికి మనోజ్ ప్రయత్నించారని ఆరోపిస్తూ మరో ఫిర్యాదు చేశారు.
ఈ రెండు ఫిర్యాదులపై పోలీసులు స్పందించి ఇరువురిపై కేసులు నమోదు చేశారు. పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో నమోదైన కేసులో మనోజ్ ఏ-1, మౌనిక ఏ-2, మరికొందరిపై కేసులు పెట్టారు. అలాగే, మనోజ్ ఫిర్యాదులో విజయ్ సింహా ఏ-1గా, సురేంద్ర ఏ-2గా, మరో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే మోహన్‌బాబు పై హైదరాబాద్‌లో జర్నలిస్టుపై దాడి కేసులో కూడా కేసు నమోదు అయి ఉండడం గమనార్హం. ఈ సంఘటనలతో మంచు కుటుంబ వివాదం మరింత పెద్ద చర్చగా మారింది.i