Kolhapur: కొత్త సంవత్సరం రోజున గుండెపోటుతో మరణించిన కొల్లాపూర్ వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్‌లో అతని ఇంటికి తీసుకెళ్తున్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంటిలో విషాదం జరగడంతో అతని బంధువులు చాలా బాధపడ్డారు. కట్ చేస్తే.. వారి ఇంటికి వెళ్లే దారిలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. పట్టణవాసులు రోజూ అధికారులను తిట్టుకోవడం తిట్టడం మామూలైపోయింది. అదేంటీ చావు అంటున్నారు.. మళ్ళీ రోడ్డు అంటున్నారు ఏమిటీ పొంతనలేని రాతలు అనుకుంటున్నారా? కంగారుపడకండి.. రెండిటికీ లింక్ ఉంది. అదే రోడ్డు గుంత చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిందంటే నమ్ముతారా? ఇది నూతన సంవత్సర అద్భుతంగా అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు.
Kolhapur: కోల్హాపూర్‌కు చెందిన పాండురంగ్ ఉల్పే అనే వ్యక్తికి కొత్త సంవత్సరం వేడుకల మధ్యలో గుండెపోటు వచ్చింది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళుతుండగా ఒక అద్భుతం జరిగింది. వారి ఇంటి దారిలో రోజూ ప్రజలు తిట్టుకునే ఒక గుంత కారణంగా ఆ మనిషికి పునర్జన్మ వచ్చింది. అవును, ఈ వార్త వింతగా అనిపించినా ఇది 100% నిజం.
ఇది కూడా చదవండి: Karnataka Government: బ్రాహ్మణ యువతులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వారిని పెళ్లి చేసుకుంటే మూడు లక్షల కానుక!
Kolhapur: ఆ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిజానికి ఆ వ్యక్తి అసలు చనిపోలేదు. కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా, మార్గంలో గుంత కారణంగా అంబులెన్స్ డ్రైవర్ గట్టిగా బ్రేక్ వేశాడు. అప్పుడు అంబులెన్స్ పెద్దగా కంపించడంతో చనిపోయినట్లు చెబుతున్న వృద్ధుడు ఊపిరి పీల్చుకున్నాడు. అలాగే, షాక్‌తో లేచి కూర్చున్నాడు. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చోవడం చూసి అంబులెన్స్ సిబ్బంది కూడా షాక్ అయ్యారు.
Kolhapur: ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చోటుచేసుకుంది. దీనినే అందరూ న్యూ ఇయర్ 2025 మిరాకిల్ అని పిలుస్తున్నారు. ఇక్కడ పాండురంగ తాత్యా ఉల్పే అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యుడు ప్రకటించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేసి వృద్ధుడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువచ్చారు. మార్గమధ్యంలో ఉన్న పెద్ద గుంతపై అంబులెన్స్ దిగడంతో మృతి చెందినట్లు చెబుతున్న పాండురంగ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పాండురంగను తిరిగి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ ఘటన తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత అద్భుతం ఎలా జరిగిందంటూ వైద్యుడే ఆశ్చర్యపోతున్నాడు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన కస్బా బావ్డా ప్రాంతంలో జరిగింది.
ఇది చదివాకా మీకు రోడ్లపై గుంతలు కూడా మంచివే అనిపించింది కదా!