Karnataka Government: పూజారులను వివాహం చేసుకోవాలనుకునే బ్రాహ్మణ మహిళలకు కర్ణాటక ప్రభుత్వం రూ.3 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తాజాగా ఈ ప్రభుత్వం బ్రాహ్మణ యువతుల కోసం కొత్త పథకాన్నీ ప్రకటించింది.
నిరుపేద బ్రాహ్మణ బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘అరుంధతి’ అనే పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం బ్రాహ్మణ అభివృద్ధి అథారిటీ ద్వారా అమలు చేస్తారు. పేద బ్రాహ్మణ మహిళల వివాహాలపై ప్రోత్సాహకంగా 25,000 రూపాయలు అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ యువతుల కోసం మరో కొత్త పథకం అమలులోకి తెచ్చారు.
ఇది కూడా చదవండి: Periya Twin Murder Case: హత్య కేసులో మాజీ ఎమ్మెల్యేకు పదేళ్లు జైలు శిక్ష
Karnataka Government: పురోహితులను పెళ్లి చేసుకోవడానికి కర్ణాటకలో బ్రాహ్మణ యువతులు వెనుకాడుతున్నారు.. అందుకోసమే ప్రభుత్వం మైత్రేయి అనే పథకాన్ని తీసుకువచ్చింది. ‘మైత్రేయి’ పథకం కింద పూజారులు, పురోహితులను వివాహం చేసుకోవాలనుకునే బ్రాహ్మణ యువతులకు ఏడాదికి రూ.లక్ష రూపాయల చొప్పున మూడేళ్లపాటు రూ.3 లక్షలు ప్రోత్సాహకం అందజేస్తారు.
అరుంధతి, మైత్రేయి పథకాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కర్ణాటక బ్రాహ్మణ అభివృద్ధి బోర్డు అధికారిక వెబ్‌సైట్ https:ksbdb.karnataka.gov.in/englishలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.