AAA-MAHAA MAX Music Contest: మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా.. మీరు మ్యూజిక్ కంపోజ్ చేసి పాప్యులర్ కావాలనే ఆసక్తి ఉందా? అయితే, మీకోసం ఒక అద్భుత అవకాశం ఇక్కడుంది. మీ మ్యూజిక్ పాన్ వరల్డ్ లెవెల్ లో తెలుగు ప్రజలు అందరూ వినే ఛాన్స్ మీకోసం తీసుకు వస్తోంది AAA – MAHAA MAX మ్యూజిక్ కాంటెస్ట్. మీ టాలెంట్ విశ్వవ్యాప్తంగా నిరూపించుకునే అరుదైన అవకాశం మీకోసం సిద్ధంగా ఉంది. అంతేకాదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా మీ సొంతం చేసుకోవచ్చు.
AAA-MAHAA MAX Music Contest: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్, మహా మాక్స్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి మ్యూజిక్ కాంటెస్ట్ ప్రారంభం అయింది. దీని కోసం ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది తమ సంగీత ప్రతిభను పోటీలలో ప్రదర్శించడానికి ఎంట్రీ అయిపోయారు. ఈ మ్యూజిక్ కాంటెస్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ – AAA ఫౌండర్ హరి మోటుపల్లి వివరించారు. ఇప్పటివరకూ స్థానికంగా.. టీవీల్లోనూ.. వివిధ అసోసియేషన్స్ నిర్వహించే పోటీల్లోనూ తమ మ్యూజిక్ ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. అయితే, తొలిసారిగా ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని హరి మోటుపల్లి చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇంత పెద్ద మ్యూజిక్ కాంపిటీషన్స్ ఆన్ లైన్ లో నిర్వహించడం జరగలేదని ఆయన అన్నారు. AAA – MAHAA MAX ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ కాంటెస్ట్ కి ఇప్పటికే అద్భుత స్పందన వస్తోందని ఆయన తెలిపారు.
AAA-MAHAA MAX Music Contest: ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ కాంటెస్ట్ లో పాల్గొనడం చాలా ఈజీ అని AAA నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి అన్నారు. ఆన్ లైన్ లో https://nationalconvention1.theaaa.org/reg/musiccontest.html లింక్ పై క్లిక్ చేసి అక్కడ కనిపించే సూచనల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ లింక్ ద్వారా మీ ఎంట్రీలను పంపించవచ్చని ఆయన చెప్పారు. ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుందని.. ఇప్పటికే ఊహించిన దాన్ని మించి ఈ మ్యూజిక్ కాంటెస్ట్ కు స్పందన వస్తోందని ఆయన అన్నారు. జనవరి 31 వ తేదీ వరకూ మాత్రమే ఎంట్రీలు తీసుకుంటామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు.
AAA – MAHAA MAX అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ మ్యూజిక్ కాంటెస్ట్ లో భారీ స్థాయిలో నగదు బహుమతులు ఇస్తున్నట్టు AAA నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల వెల్లడించారు. ఇప్పటివరకూ మ్యూజిక్ కాంటెస్ట్ చరిత్రలో ఇంత మొత్తంలో నగదు బహుమతులు ఎప్పుడూ లేవన్నారు. ఈ పోటీల్లో విజేతకు రూ. 7 లక్షలు ఇస్తారని చెప్పారు. అలాగే రన్నరప్ కు రూ.4 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇక పోటీలో పాల్గొన్న వారిలో 50 మంది ప్రతిభావంతులకు ప్రత్యేకంగా రూ.10 వేల రూపాయలతో పాటుగా.. AAA ట్రోఫీ, AAA సర్టిఫికెట్ అందచేస్తారని బాలాజీ వీర్నాల వివరించారు.
AAA-MAHAA MAX Music Contest: మ్యూజిక్ కంపోజ్ చేయడంలో మీ ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పోటీలకు మీ ఎంట్రీని పంపించేయండి. లక్షల రూపాయల బహుమతులను సొంతం చేసుకోవడంతో పాటు.. ప్రపంచంలోని తెలుగువారందరికీ సుపరిచితులుగా మారిపోండి.