Mammootty: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మామ పి.ఎస్. అబు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 90 ఏళ్ళ వయసు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. పి.ఎస్. అబు కి మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టితో సహా నలుగురు పిల్లలు ఉన్నారు. అబు మాజీ సిఐటియు విభాగం మలంచరక్ కన్వీనర్ . మాజీ ఇలయ కోవిలకం మహల్ అధ్యక్షుడిగా పనిచేశారు. బుధవారం రాత్రి 8 గంటలకు చెంబిట్ట చర్చి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. అబు భార్య నబీసా 2020లో మరణించారు. ఆమెకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. కాగా మమ్ముట్టి, సల్ఫత్ 1979లో వివాహం చేసుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మమ్ముట్టి కొనసాగుతున్నారు. తెలుగులో స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో, మరెన్నో డబ్బింగ్ సినిమాలతో పాప్యులారిటీ తెచ్చుకున్నారు. ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.
