Unstoppable With NBK S4 E9 Promo: శంకర్ డైరెక్టర్ లో రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయగా ఇందులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. వీరితో పాటు సునీల్, అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య నటిస్తున్నారు, రామ్ చరణ్, శంకర్ వీరి ఇద్దరి కంబో లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపైన అభిమానులతో పాటు సినిమా పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఇంకా టీజర్ తో అంచనాలను పెంచింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో అప్పటికి దాక ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ ఎంతైనా ఊహించుకోండి అంతకు మించి ఉంటుంది అని ట్రైలర్ తో సమాధానం ఇచ్చారు.సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. రిలీజ్ కి తక్కువ సమయం ఉండడంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ప్రమోషన్లలో భాగంగా బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ కి రాంచరణ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు వచ్చారు. దీనికి సంబందించిన ప్రోమో విడుదల చేశారు.