Hyderabad: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై కారు బీభత్సం సృష్టించింది. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గేటు సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్లో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కడ్తాల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పరిశీలించిన డాక్టర్లు ఇద్దరు అప్పటికే మరణించినట్టుగా నిర్ధారించారు. మృతి చెందిన ఇద్దరు పహాడి షరీఫ్ గా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను ఉస్మానియా మార్చరికి తరలించారు. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.