Mahbubnagar:

Mahbubnagar: మాన‌సిక దివ్యాంగురాలిపై అమానుషం.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో జిల్లాలో ఘ‌ట‌న‌

Mahbubnagar: ఆమె ఓ మాన‌సిక దివ్యాంగురాలు. విచ‌క్ష‌ణ తెలియ‌దు. ఇదే అద‌నుగా బంధువే ఆమెపై క‌న్నేశాడు. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఆ దుండ‌గుడు ఇంట్లో ఎవ‌రూ స‌మ‌యం చూసి 35 ఏండ్ల వ‌య‌సున్న ఆ యువతిపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఇలా ఆమెపై ప‌లుమార్లు అదును దొరికిన‌ప్పుడల్లా లైంగిక‌దాడి చేస్తూ వ‌చ్చాడు. వీడిని ఆస‌రా చేసుకొని వాడి స్నేహితుడు కూడా ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

Mahbubnagar: మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా భూత్పూర్ మండ‌లం క‌రివెన గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ మాన‌సిక దివ్యాంగురాలిపై ఆమెకు స‌మీప బంధువైన ప‌ర‌మేశ్ అనే వ్య‌క్తి లైంగిక‌దాడికి ఒడిగ‌ట్టాడు. త‌ర‌చూ ఆమెపై లైంగిక దాడి చేస్తూనే వ‌చ్చాడు. అత‌ని కోసం వ‌చ్చిన స్నేహితుడు శేఖ‌ర్‌కు ఈ విష‌యం తెలిసింది. ఇదే అద‌నుగా మాన‌సికంగా ఏమీ తెలియ‌ని ఆ యువ‌తిపై శేకర్ అనే దుండగుడు కూడా లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. వీరిద్ద‌రూ ప‌లుమార్లు ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు.

Mahbubnagar: ఇటీవ‌ల మాన‌సిక దివ్యాంగురాలైన‌ ఆ యువ‌తిపై కోతి దాడి చేయ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమెను ప‌రీక్షించిన వైద్యులు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ఆందోళ‌న‌కు గురిచేసే విష‌యం చెప్పారు. ఆ యువ‌తి గ‌ర్భ‌వ‌తి అని, ఐదు నెల‌ల‌వుతుంద‌ని చెప్పారు. ఏం చేయాలో తోచ‌ని ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు అస‌లు విష‌యాన్ని రాబ‌ట్టారు.

Mahbubnagar: ఆ యువ‌తి గ‌ర్భ‌వ‌తి కావ‌డానికి ప‌ర‌మేశ్‌, శేఖ‌ర్ లైంగిక‌దాడికి పాల్ప‌డిన‌ విష‌యాలు వెలుగుకి వ‌చ్చాయి. దీంతో ఆ ఇద్ద‌రిపై గ్రామంలోని కొంద‌రు పెద్దలను సంప్రదించ‌గా, ఆ ఇద్ద‌రు దుండ‌గుల‌తో రాజీ కుదిర్చి.. కొంత న‌గ‌దు ఆ యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు ఇప్పించే ప్ర‌య‌త్నం సాగింది. ఈ రాజీ విష‌యం కాస్తా బెడిసి కొట్ట‌డంతో బాధితురాలి కుటుంబ స‌భ్యులు భూత్పూర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి, ఆ ఇద్ద‌రు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *