Raptadu Incident

Crime News: రాప్తాడు స్కూల్ దాడి కేసులో బిగ్ బ్రేకింగ్.. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిందితుడు అరెస్ట్.. !

Crime News: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన కిరాతక దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోనే బాలికపై దాడి చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాగలూరు గ్రామానికి చెందిన హేమంత్‌గా పోలీసులు గుర్తించారు.

నిందితుడి నేపథ్యం.. బాధితురాలికి వరుసకు బంధువు!

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు హేమంత్ స్వగ్రామం ధర్మవరం మండలం నాగలూరు. తల్లిదండ్రులు చనిపోవడంతో దాదాపు పదేళ్ల క్రితమే అయ్యవారిపల్లెకు వచ్చి అక్క వద్దే ఉంటున్నాడు.నిందితుడు బాధితురాలి కుటుంబానికి సమీప బంధువేనని పోలీసులు నిర్ధారించారు.
ఉదయం 10:30 గంటల సమయంలో పాఠశాలలో రెండో పీరియడ్ తరగతులు జరుగుతుండగా హేమంత్ నేరుగా చెట్లు కోసే ఎలక్ట్రిక్ రంపంతో క్లాస్‌రూమ్‌లోకి చొరబడ్డాడు.విద్యార్థులంతా చూస్తుండగానే సదరు బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు.దాడి అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని రైలు ఎక్కి పారిపోయే ప్రయత్నంలో ఉండగా, ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పోలీసులు మాటువేసి అతడిని పట్టుకున్నారు.
ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు. వరుసకు బంధువైన బాలికపై ఇంతటి పాశవిక దాడి చేయడానికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *