Mahaa News Effect: పీడీఎస్ బియ్యానికి రెక్కలు వస్తున్న విధానంపై మహాన్యూస్ varusaga ప్రత్యేక కథనాలు ఇస్తూ వస్తోంది. ఈకథనాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. పిడిఎస్ రైస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం అయింది. ఇందులో భాగంగా కాకినాడ పోర్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సివిల్ సప్లయిస్ మినిష్టర్ నాదెండ్ల మనోహర్ చేరుకున్నారు. గోడౌన్లలో నిలువ ఉన్న పీడీఎస్ బియ్యాన్ని చూసిన పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు.
Mahaa News Effect: ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నపుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాదా అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావుతో పాటు పోర్టు అధికారులను ఆయన నిలదీశారు. ఈ మధ్య 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి షిప్ లో ఆయన వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసిన పవన్ కళ్యాణ్ ఇంత జరుగుతున్నా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన X లో ఒక పోస్ట్ చేశారు.
I came to Kakinada port to check the illegal smuggling of PDS rice. A scam Which became rampant in last regime and it’s still continuing. This port looks like free for all. No accountability. pic.twitter.com/4H9e8z4Fyz
— Pawan Kalyan (@PawanKalyan) November 29, 2024
Mahaa News Effect: సౌత్ ఆఫ్రికా వెల్లెందెందుకు రేషన్ బియ్యం తొ రెడీ గా ఉన్న స్టెల్లా షిప్ ను పరిశిలించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా రాత్రి మరో బాచిలో వేలాది టన్నుల రైస్ నిల్వలు అధికారులు గుర్తించారు. గోడౌన్లలో పెద్ద ఎత్తున రేషన్ రైస్ ను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పట్టుకున్నారు.
Mahaa News Effect: ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ కంట్రీలకు ఏదోఒక విధంగా రైస్ మాఫియా తరలిస్తూనే వస్తోంది. కాకినాడ కేంద్రంగా లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్ భారీగా రేషన్ రైస్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రైస్ మాఫియా ఆగడాలకుఅధికారులు కొమ్ము కాస్తున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈసందర్భంగా ఆయన కాకినాడ పోర్టులో బియ్యం గొడౌన్స్ తో పాటు బియ్యాన్ని తరలిస్తున్న షిప్స్ ను కూడా పరిశీలించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.