YCP Criminal Politics: 2019 నుండి 2024 మధ్య ఐదేళ్ల కాలంలో ఏపీ ఎంతలా వణికిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు వైసీపీ ఆ ఐదేళ్లు పరిపాలన చేసిందో, లేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నెన్ని నేరాలు చేసిందో అంతుపట్టని పరిస్థితి. తవ్వుతున్న కొద్దీ పాపాల పుట్ట నుండి ఒక్కో దారుణం వెలుగు చూస్తూనే ఉంది. ఇక గత పది నెలలుగా వైసీపీ బిహేవియర్‌ని చూస్తే.. ఆ పార్టీ చేస్తోంది రాజకీయమా? రాజకీయ రాద్ధాంతమా? అన్న సందేహం కలుగక మానదు. అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రతి సంఘటననీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ అదే తనకి పనికొచ్చే మైలేజ్ అనుకుంటోందా? ఇంతకీ వైసీపీ రాజకీయాలు ఎటు దారి తీయనున్నాయ్? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఎన్ని దారుణాలు చూసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేరాలకు ఆ పార్టీ అడ్డాగా మారిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అధికార దుర్వినియోగం, కుట్రలు, తప్పుడు ప్రచారాలతో రాష్ట్రాన్ని అస్థిరపరిచిన వైసీపీ పాలనలో అన్ని వర్గాలు బాధననుభవించారు. ఇప్పుడు అధికారం కోల్పోయినా, ఆ పార్టీ తీరు మారలేదన్న విమర్శ వినబడుతోంది. రాజకీయం పేరుతో నీచపు కుట్రలు, కలుషిత వ్యూహాలతో రాష్ట్రంలో శాంతిని భగ్నం చేస్తోందని పౌర సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడం నుంచి, తిరుమల వంటి పవిత్ర స్థలంపై అసత్య ఆరోపణల వరకు… వైసీపీ రాజకీయం హద్దు దాటుతోందన్న చర్చ అన్ని వర్గాల్లో జరుగుతోంది.
జగన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ రాజకీయం మొత్తం పొలికల్ హైడ్రామాల బాటలోనే నడిచింది. అధికారంలో ఉన్నప్పుడు కోడికత్తి, గులకరాయి ఘటనలను ఆయుధాలుగా మలుచుకున్న సంగతి తెలిసిందే. నేడు ప్రతిపక్ష హోదా కోల్పోయినా, జగన్ తన డాబు, దర్పం కోసం కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగా తెరపైకి తెచ్చిందే రాప్తాడులో హెలీప్యాడ్ వద్ద రక్తికట్టించిన వివాదం. జగన్‌కి భద్రత లేదన్న వాదన తెరపైకి తెస్తోంది నిజంగా ఆయనకు భద్రత లేని కారణంగా కాదు.. ఆయన కోరుకుంటున్న ముఖ్యమంత్రి స్థాయి భద్రత కోసమే ఆ ఆరాటం అన్న సంగతి స్పష్టంగానే అర్థమౌతోంది. ఇక అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులను అడ్డుకునేందుకు ఫిర్యాదులు, పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు… ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధిని నిరోధించే కుట్రలే అంటున్నారు పరిశీలకులు.
వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా అన్న వాదన మేధావి వర్గాల నుండి వ్యక్తమవుతోంది. మద్యం విధానం పేరిట దోపిడీ, అప్పులు చేసి ప్రజలను ఆకర్షించే పథకాలు… ఇవే జగన్ సర్కార్ సాధించిన ఘనతలు అన్న విమర్శ ఉంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి నిర్మాణం, పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేస్తుంటే, వైసీపీ అడ్డగోలు ఫిర్యాదులు, తప్పుడు ప్రచారాలతో ఆటంకాలు సృష్టిస్తోంది. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించడం, తిరుమల గోశాలలో గోమాతల సహజ మరణాలను కూడా వదలకుండా రాజకీయం చేయడం.. ఇవన్నీ వైసీపీ మార్క్ రాజకీయాలను స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mahaa Vamsi: సచివాలయం లో బాబు..ఇంట్లో మంత్రులు..
ఇక వైసీపీ రాజకీయ నీచత్వానికి సరికొత్త నిర్వచనంగా నిలుస్తోంది… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్, ఆయన సతీమణి అన్నా లెజినోవాలపై చేస్తున్న ట్రోలింగ్. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం నుంచి ఆఖరికి రాజకీయాలకు సంబంధం లేని పసిపిల్లలు, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం వైసీపీకే చెల్లింది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడిన సంఘటనను కూడా రాజకీయం చేసింది వైసీపీ. ఏడేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడిన సమయంలో, వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం అత్యంత హేయం.
అంతకు మించిన దారుణం… పవన్ భార్య అన్నా లెజనెవా తిరుమలలో తలనీలాలు సమర్పించడంపై చేస్తోన్న నీచ రాజకీయం అంటూ మండి పడుతున్నారు సామాన్య ప్రజలు. “మహిళలు తలనీలాలు సమర్పించకూడదు” అంటూ.. గరికపాటి ప్రవచనాలను వక్రీకరించి, అన్నా లెజినోవా చర్యను తప్పుగా చిత్రీకరించింది ఆ పార్టీ సోషల్‌మీడియా. ఇది వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారు జనసేన శ్రేణులు. అన్నా క్రిస్టియన్ అయినా, హిందూ సంప్రదాయాల పట్ల గౌరవంతో తిరుమల నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.17 లక్షలు విరాళమిచ్చారు. ఇలాంటి భక్తి, సాంస్కృతిక గౌరవాన్ని ప్రశంసించాల్సిన చోట, వైసీపీ దాన్ని వివాదంగా మార్చడం సమాజానికి హానికరమని విశ్లేషకులు సైతం ఘర్హిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక, పసిపిల్లలు, మహిళలు, ఆచారాలపై దాడి చేయడం వైసీపీ సైకో లాజికల్ రాజకీయానికి నిదర్శనం అంటున్నారు. ఇలాంటి వికృత రాజకీయాలతో ఆ పార్టీ పుంజుకోవడం కంటే.. మరింత దారుణంగా పతమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇకనైనా వైసీపీ తన పంథా మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.