Maha Kumbh 2025: మహాకుంభమేళా లో ఒకటి రెండు కాదు ఏకంగా మూడున్నర కోట్ల మంది భక్తులు అమృత్ స్నాన్ ఉత్సవంలో పాల్గొన్నారు. 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాలో రెండోరోజు మంగళవారం జన ప్రభంజనం కనిపించింది. పవిత్ర త్రివేణీ సంగమంలో ఎటు చూసినా నీరు బదులు జనమే కనిపించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రాజస్నానం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ సమయంలో, జునా అఖారాతో సహా మొత్తం 13 అఖారాలకు చెందిన సాధువులు స్నానం చేశారు.
Maha Kumbh 2025: స్నానం ముగించుకుని ప్రయాగ్‌రాజ్ నుండి ప్రజలు తిరిగి వెళ్లే క్రమంలో విపరీతమైన ఇబ్బందులు పడ్డారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు వెళ్లే రహదారులపై భారీగా జనం కనిపించారు. ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టడానికి ఖాళీ లేదు. హాలులో ప్రజలను అడ్డుకున్నారు.
Maha Kumbh 2025: ప్లాట్‌ఫారమ్‌పైకి మాత్రమే రైలు వచ్చిన తరువాత మాత్రమే ప్రయాణీకులను లోపలి అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 55 మహాకుంభ ప్రత్యేక రైళ్లను పంపినట్లు రైల్వే పీఆర్వో అమిత్ సింగ్ తెలిపారు.
ఇక కుంభ మేళాలో పాల్గొనడానికి వచ్చిన యాత్రీకుల్లో సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు నలుగురు గుండెపోటుతో మృతి చెందారు. వీరిలో ముగ్గురు స్వరూప రాణి నెహ్రూలో ఒకరు సెంట్రల్ హాస్పిటల్‌లో చేరారు.
Maha Kumbh 2025: నైట్ షెల్టర్లు, హోటళ్లు నిండిపోయాయి. యాత్రీకులు ఈ రోజు ప్రయాగ్‌రాజ్‌ను విడిచిపెట్టడం సాధ్యం కాదని భావించి నైట్ షెల్టర్‌లను ఆశ్రయించారు. కానీ, నైట్ షెల్టర్లన్నీ నిండిపోయాయి. హోటళ్లు, నైట్ షెల్టర్ల ముందు వేల సంఖ్యలో జనం కనిపించారు. ప్రజలు రోడ్లపైనే మకాం వేశారు.
సోమవారం తొలి స్నాన పౌష్ పూర్ణిమ సందర్భంగా 1.65 కోట్ల మంది సంగమంలో స్నానాలు చేశారు. మంగళవారం 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు చేశారు. ఈ విధంగా 2 రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది సంగమంలో స్నానాలు చేశారు.
సాధువులు ఉదయం 6 గంటలకు హర-హర మహాదేవ్ అని స్మరిస్తూ ఘాట్‌కు చేరుకున్నారు . సన్యాసులు తమ చేతుల్లో ఖడ్గాలు, త్రిశూలాలు, దమ్రులతో ‘హర్-హర్ మహాదేవ్’ అంటూ నినాదాలు చేస్తూ ఘాట్‌లకు చేరుకున్నారు. మహాకుంభ్‌లో మొదటిసారిగా షాహి స్నాన్‌కు బదులుగా అమృత్ స్నాన్ అనే పదాన్ని ఉపయోగించారు. పేరు మార్చాలని అఖారాలు ప్రతిపాదించాయి.
మర్చిపోలేని అనుభవం . .
పోలాండ్ నుండి వచ్చిన భక్తురాలు “నేను మొదటిసారిగా మహాకుంభానికి వచ్చాను. మూడు రోజులు ఇక్కడే ఉంటాను. నేను మహాకుంభ్‌కు హాజరవుతున్నాను, ఎందుకంటే దీనికి ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. నేను కుంభ మేళాను చూడడానికి వచ్చాను. ఇక్కడ ఉండటం చాలా బాగుంది. నాకు భారతదేశ ప్రజలంటే ఇష్టం. ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. నేను ఉదయం చాలా ఆనందించాను. ఈ ఈవెంట్‌ని ఇతరులు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చారు.
Devotee from Poland shared views on her visit to Mahakumbh 2025. #महाकुम्भ_अमृत_स्नान pic.twitter.com/QOxequuQwc
— Mahakumbh (@MahaKumbh_2025) January 14, 2025